న్యూ ఇయర్ రోజున సెక్రటేరియట్ కు వచ్చిన పారికర్

  • అనారోగ్య కారణాలతో నాలుగు నెలలుగా ఆసుపత్రి, ఇంటికి పరిమితమైన పారికర్
  • సెక్రటేరియట్ వద్ద పారికర్ కు ఘన స్వాగతం
  • ఉద్యోగుల సమస్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అనారోగ్య కారణాలతో గత నాలుగు నెలలుగా ఆసుపత్రి, ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ ప్రభుత్వ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆ సందర్భంగా ముక్కులో పైపు పెట్టుకుని ఉన్న ఆయనను చూసి అందరూ షాక్ అయ్యారు.

మరోవైపు, న్యూ ఇయర్ సందర్భంగా పారికర్ ఈరోజు సెక్రటేరియట్ కు వచ్చారు. ఉదయం 10.45కు సెక్రటేరియట్ లోని తన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున సెక్రటేరియట్ కు చేరుకున్న బీజేపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఉద్యోగుల సమస్యలపై ఉన్నతాధికారులతో పారికర్ సమీక్ష నిర్వహించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు, ప్రమోషన్లు, బదిలీలపై చర్చించారు. సీఎం కార్యాలయ సిబ్బందితో కూడా ఆయన సమావేశమయ్యారు.
Go Back to Shorts
manohar parrikar
goa
cm
secretariat

More Telugu News